'బ్రూస్ లీ' మరణించి 40 ఏళ్ళు.. అయినా వీడని డెత్ మిస్టరీ

- July 19, 2017 , by Maagulf
'బ్రూస్ లీ' మరణించి 40 ఏళ్ళు.. అయినా వీడని డెత్ మిస్టరీ

యాక్షన్ ఎంటర్ ట్రైనర్ మూవీ అనగానే నేటి తరానికి కూడా ముందుగా గుర్తుకొచ్చేది.. బ్రూస్ లీ.. హాలీవుడ్ లో అడుగు పెట్టి తన మార్షల్ ఆర్ట్స్ తో సరికొత్త సినిమాను హాలీవుడ్ కి పరిచయం చేసిన ఘనత బ్రూస్ లీ సొంతం.. ఎంటర్ ది డ్రాగన్ సినిమాతో సంచలనం సృష్టించిన బ్రూలీ ఆసియా ఖండం యుధ్ధ కళలు అయిన కుంగ్ ఫూ, కరాటే ని తన సినిమాల తో అమెరికా, ఐరోపా ఖండాలకు పరిచయం చేశాడు.. హాలీవుడ్ సినిమాలకు షాక్ ఇచ్చేలా ఎంటర్ ది న్యూ డ్రాగన్ సినిమా కలక్షన్లతో రికార్డ్ సృష్టించింది. కళాకారులకు ప్రాంతీయ భాషా బేధాలు ఉండవు అని రుజువు చేసిన బ్రూస్ లీ అత్యంత పిన్న వయసులో మృతి చెందారు. అదీ తన ఎంటర్ ది న్యూ డ్రాగన్ సినిమా రిలీజ్ అవ్వకుండానే మరణించాడు. 1973 మే 10 న హఠాత్తుగా కుప్ప కూలిపోయిన బ్రూస్ లీ ఆస్పత్రి లో చికిత్స తీసుకొన్న తార్వత కోలుకున్నారు. కాగా బ్రూస్ లీ మరో సినిమా ద గేమ్ ఆఫ్ డెత్ అనే మరో సినిమా చెయ్యడానికి సన్నాహాల్లో ఉన్నారు.. ఈ నేపద్యంలో నటి బ్రేటీ ఇంట్లో బ్రూస్ లీ భేటీ అయ్యారు. అక్కడ బ్రూస్ లీకి తీవ్ర తలనొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. బ్రేటీ ఇచ్చిన మాత్రా వేసుకొన్న బ్రూస్ లీ మరింక లేవలేదు.. అతి చిన్న వయసులో 32 ఏళ్ల కే జూలై 20 1973న మరణించారు. ఆయన మరణించి జూలై 20 తో 40 ఏళ్ళు పూర్తి అయ్యింది.. 1970 దశకంలో మరణించినా నేటి తరానికి కూడా బ్రూస్ లీ సుపరిచితుడే.. కాగా బ్రూస్ లీ మరణం పై అనేక వాదనలు వినిపిస్తుంటాయి.. బ్రూస్ లీ ఉంటే తమ హవా తగ్గిపోతుంది అని హాలీవుడ్ వారే కుట్రతో విష ప్రయోగం చేసి చంపేశారనే వాదన కూడా ఉన్నది.. విశ్వాన్ని జయించిన కుంగ్ ఫూ వీరుడు అంతు చిక్కని విధంగా మృత్యు ఒడికి చేరుకొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com