18 ఏళ్ళ లిమిట్‌పై మేన్‌పవర్‌ ఖండన

- July 19, 2017 , by Maagulf
18 ఏళ్ళ లిమిట్‌పై మేన్‌పవర్‌ ఖండన

కువైట్‌ మ్యాన్‌ పవర్‌ పబ్లిక్‌ అథారిటీ యాక్టింగ్‌ డైరెక్టర్‌ అహ్మద్‌ అల్‌ మౌసా, డెసిషన్‌ 839/2015 ప్రకారమే వర్క్‌ పర్మిట్ల రెన్యువల్‌ ఉంటుందనీ, ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. 18 ఏళ్ళు కువైట్‌లో పనిచేసినవారికి వర్క్‌ పర్మిట్‌ రద్దు చేయాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు. మేన్‌పవర్‌ అథారిటీ దీనికి సంబంధించి ఎలాంటి చర్చా చేయలేదని కూడా ఆయన చెప్పారు. అలాంటి అంశాలు తమ దృష్టికి వస్తే, దానికి సంబంధించిన మెకానిజం వేరే ఉంటుందని తెలిపారాయన. అయితే కువైట్‌లో వలస కార్మికుల సంఖ్య తగ్గించేందుకు పలు ప్రపోజల్స్‌ వచ్చాయి. ఐదేళ్ళు, పదేళ్ళు, పదిహేనేళ్ళకు పరిమితం చేయాలనే ప్రపోజల్స్‌ వచ్చినా, అవేవీ కార్యరూపం దాల్చలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com