ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో ఘోర ప్రమాదం, ముగ్గురు హైదరాబాద్‌వాసుల మృతి
- July 19, 2017
ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాదుకు కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన అయోధ్యలో మంగళవారం జరిగింది.
చనిపోయిన వారిలో నూతన్ బాయి, పద్మా బాయి, విసాక్ సింగ్‌లు ఉన్నారు. వీరు నగరంలోని దూల్‌పేటకు చెందిన వారు. వీరు ముగ్గురు, తమ ఐదుగురు పిల్లలతో కలిసి శనివారం యాత్రకు వెళ్లారు.
హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైలులో వారణాసి వెళ్లారు. వారు వారణాసిలో కాశీవిశ్వనాథుడిని దర్శించుకున్నారు. మరో రెండు ప్రాంతాలలో పర్యటించారు.
అయోధ్యకు వెళ్లేందుకు మంగళవారం ఉదయం టాటా సుమో వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. వారు వెళ్తుండగా సుల్తాన్ పూర్లో డిసిఎం లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనలో వికాస్, పద్మ, నూతన్ బాయిలు తీవ్ర గాయాల కారణంగా మృతి చెందారు. ఐదుగురు పిల్లలకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రిలో చేర్పించారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









