ఉత్తర ప్రదేశ్‌ అయోధ్యలో ఘోర ప్రమాదం, ముగ్గురు హైదరాబాద్‌వాసుల మృతి

- July 19, 2017 , by Maagulf
ఉత్తర ప్రదేశ్‌ అయోధ్యలో ఘోర ప్రమాదం, ముగ్గురు హైదరాబాద్‌వాసుల మృతి

ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాదుకు కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన అయోధ్యలో మంగళవారం జరిగింది.
చనిపోయిన వారిలో నూతన్ బాయి, పద్మా బాయి, విసాక్ సింగ్‌లు ఉన్నారు. వీరు నగరంలోని దూల్‌పేటకు చెందిన వారు. వీరు ముగ్గురు, తమ ఐదుగురు పిల్లలతో కలిసి శనివారం యాత్రకు వెళ్లారు.
హైదరాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి రైలులో వారణాసి వెళ్లారు. వారు వారణాసిలో కాశీవిశ్వనాథుడిని దర్శించుకున్నారు. మరో రెండు ప్రాంతాలలో పర్యటించారు.
అయోధ్యకు వెళ్లేందుకు మంగళవారం ఉదయం టాటా సుమో వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. వారు వెళ్తుండగా సుల్తాన్ పూర్‌లో డిసిఎం లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనలో వికాస్, పద్మ, నూతన్ బాయిలు తీవ్ర గాయాల కారణంగా మృతి చెందారు. ఐదుగురు పిల్లలకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రిలో చేర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com