తెలుగు వెండి తెరకు మరో కొత్త డైరెక్టర్

- July 20, 2017 , by Maagulf
తెలుగు వెండి తెరకు మరో కొత్త డైరెక్టర్

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ రైటర్స్ అంత డైరెక్టర్స్ గా మరి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు..ఇప్పటికే త్రివిక్రమ్ , కొరటాల శివ లు వెండి తెర ఫై టాప్ డైరెక్టర్స్ గా రాణిస్తుండగా , ఈ మధ్య నే వక్కంతం వంశీ కూడా అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య' అనే మూవీ ని స్టార్ట్ చేసాడు. ఇప్పుడు తాజాగా మరో రైటర్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు.
'పూల రంగడు, సర్దార్ గబ్బర్ సింగ్, లౌక్యం, పోటుగాడు, పవర్' వంటి సినిమాలకు సంభాషణలు అందించిన శ్రీధర్ సిపాన 'బృందావనమది అందరిది' అనే మూవీ తో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రం లో కామెడీ, ఎమోషన్స్ ఎక్కువగా ఉండనున్నాయట. కమర్షియల్ కథలు చాలానే ఉన్నప్పటికీ మొదటి సినిమాగా ఈ కథ అయితే బాగుంటుందని, దర్శకుడిగా మంచి గుర్తింపు వస్తుందని దీన్నీ ఎంచుకున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com