రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా సెటైర్
- October 19, 2015
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ నుండి కనీసం డ్రెస్సు కూడా మార్చకుండా నేరుగా వెళ్లి అన్నయ్య చిరంజీవిని కలిసిన సంగతి తెలిసిందే. చాలా విరామం తర్వాత 'బ్రూస్లీ' చిత్రంలో కనిపించిన అన్నయ్య చిరంజీవికి పవన్ అభినందనలు తెలిపారు. అయితే వీరి కలయికపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా సెటైర్ వేసారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేసిన వర్మ... నయాగారా జలపాతం తర్వాత ఇదే గొప్ప విజువల్. చాలా సంతోషంగా ఉంది... ఈ సంతోషంలో మరోసారి 'బ్రూస్ లీ' సినిమా చూస్తాను అంటూ ట్వీట్ చేసారు. ఇలా ట్వీట్ చేయడం ద్వారా కష్టాల్లో పడ్డ బ్రూస్ లీ సినిమాకు ప్రచారం కల్పించడానికే పవన్ కళ్యాణ్ ఇలా చేసాడని చెప్పకనే చెప్పాడు వర్మ. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మళ్లీ కలవడం కలే అనుకున్నాను. లేచి చూసాక ఇది నిజమే అని రియలైజ్ అయ్యాను. మెగా ఫ్యామిలీ విషయంలో ఇలా జరుగడం చాలా సంతోషంగా ఉంది అంటూ వర్మ ట్వీట్ చేసారు
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







