అమెరికా అధ్యక్షుని ఆదేశాలు ఉత్తర కొరియా ఎవ్వరు వెళ్ళవొద్దు
- July 22, 2017
ఉత్తర కొరియాలో అమెరికన్లకు రక్షణ లేదని, అక్కడ నివసిస్తున్న ప్రవాస అమెరికన్లంతా వెంటనే తిరిగి అమెరికా వెళ్లిపోవాలంటూ ఉత్తర కొరియాలోని అమెరికా దౌత్య కేంద్రం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనల మేరకే ఈ ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది.
అమెరికా దౌత్యాధికారి రే టెల్లార్సన్ పేరు మీద విడుదలైన ఈ ప్రకటనలో.. భవిష్యత్తులో కూడా అమెరికన్లు ఉత్తర కొరియా వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అక్కడ ఇటీవల ఓటో వాంబియార్ అనే అమెరికన్ పౌరుడి మరణం తనను కలచివేసిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దౌత్యాధికారి రే టెల్లార్సన్ ప్రకటనలో పేర్కొన్నారు.
జూలై 27 నుంచి సరిగ్గా 30 రోజుల్లోగా ఉత్తర కొరియాలో ఉండే అమెరికన్లంతా స్వదేశానికి రావాలని, లేకపోతే వారి పాస్‌పోర్టులను పునరుద్ధరించేది లేదని రే స్పష్టం చేశారు. అలాగే జూలై 27 తర్వాత ఉత్తర కొరియాకు అమెరికన్లు ఎవరూ వెళ్లరాదని, ఒకవేళ తమ హెచ్చరికలను కాదని వెళితే వారి రక్షణతో తమకు ఎలాంటి సంబంధం ఉండదని కూడా రే ఆ ప్రకటనలో వివరించారు.
దీనిపై ఉత్తర కొరియా విదేశాంగ శాఖ కూడా స్పందిస్తూ.. అమెరికాతో దౌత్య సంబంధాలను కొనసాగించే యోచనలో తాము కూడా లేమని, జూలై 27 కంటే ముందు కూడా వెళ్లిపోవాలనుకునే వారు వెళ్లిపోవచ్చని, ఇలాంటి ప్రకటనలకు బెదిరేది లేదని తెలిపింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







