అల్-డీరియా గేట్ పునరుద్ధరణ .... కమిషన్ ఆమోదం
- July 22, 2017
జెడ్డా - ఆల్-డిరియయా గేట్ పునరుద్ధరణ కమిషన్ స్థాపనకు గురువారం రాయల్ ఆర్డర్ తో ఆమోదించింది. కమిషన్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మెన్ గా క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రీమియర్ మరియు రక్షణ మంత్రి, అబ్దులాజిజ్ బిన్ మహ్మద్ బిన్ అయ్యాఫ్ అల్ మిఖ్రెన్ ఉంటారు. , అహ్మద్ బిన్ అక్ఇల్ అల్ ఖతీబ్, డాక్టర్. ఫాహ్ద్ బిన్ అబ్దుల్లా అల్ సమ్మారి మరియు ఇంగ్. ఇబ్రహీం బిన్ మహ్మద్ అల్ సుల్తాన్ ఈ కమిషన్ లో మిగిలిన సభ్యులుగా నియమించ బడ్డారు.అల్-ఉల మరియు అల్-డిరియయా రాజ్యం యొక్క చరిత్ర అంతటా అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా ఉంది. వీటిలో కొన్ని గొప్ప పురావస్తు స్మారక చిహ్నాలు ఉన్నాయి, వీటిలో కొన్ని ఉపరితలం పై చూడవచ్చు, అయితే మిగిలినవి ఇప్పటికీ నేల కింద ఖననం చేయబడ్డాయి. తాముడ్ మరియు మాడాన్ సాలేహ్ యుగాలు మరియు రాతియుగంకు చెందిన ప్రాచీన స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఇది ఒక సమీకృత పర్యాటక నగరం. ఈ స్థలాల సంరక్షణ ద్వారా, కింగ్డమ్ లోనే కాక మధ్యప్రాచ్యంలో అత్యంత ముఖ్యమైన సందర్శన ప్రదేశాలలో ఒకటిగా చేయడానికి ప్రయత్నిస్తుంది. రాజ్యం మరియు విదేశాల్లో నుండి ఒక మిలియన్ పర్యాటకులను ఆకర్షించడానికి లక్ష్యంగా కింగ్డమ్ పెట్టుకుంది. మధ్యప్రాచ్యంలో అతిపెద్ద ఇస్లామిక్ మ్యూజియం కలిగి ఉన్న దిరియా గేట్ ఒక ముఖ్యమైన సాంస్కృతిక పర్యటన ప్రాజెక్ట్. కింగ్ సల్మాన్ లైబ్రరీ, మార్కెట్, మాల్స్, రెస్టారెంట్లు మరియు వేడుక స్ధలాలు ఇక్కడ ఉన్నాయి. డియీరాహ్ గేట్ అభివృద్ధి కోసం ప్రాజెక్ట్ ప్రాంతం 1.5 మిలియన్ చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఆక్రమించింది. ఈ ప్రాజెక్ట్ రియాద్ నివాసితులకు మరియు సందర్శకులకు ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







