షార్జాలో మ్లీహా రోడ్‌ ప్రాజెక్ట్‌ పనులు 55 శాతం పూర్తి

- July 22, 2017 , by Maagulf
షార్జాలో మ్లీహా రోడ్‌ ప్రాజెక్ట్‌ పనులు 55 శాతం పూర్తి

షార్జా:మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌, షార్జాలో 55 శాతం మ్లీహా రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుని పూర్తి చేసింది. వచ్చే ఏడాది తొలి క్వార్టర్‌ నాటికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తి కానుంది. మొత్తం 174 మిలియన్‌ దిర్హామ్‌లతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు. అల్‌ బాది ఇంటర్‌సెక్షన్‌ నుంచి షేక్‌ ఖలీఫా రోడ్‌ వరకు 42 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్‌ చేశారు. మిగతా ప్రాజెక్టులకంటే ఈ ప్రాజెక్టు భిన్నమైనదని మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అండర్‌ సెక్రెటరీ హస్సన్‌ జుమా అల్‌ మన్సౌరి చెప్పారు. యూఏఈలో ఈ తరహా ప్రాజెక్టులు ఎంతో ప్రతిష్టాత్మకమైనవే కాకుండా, దేశ అభివృద్ధికి అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో రోడ్‌ క్వాలిటీకి సంబంధించి యూఏఈ మొదటి స్థానంలో నిలిచినట్లు చెప్పారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com