తెలంగాణ ప్రజా సమితి ఖతార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

- July 23, 2017 , by Maagulf

దోహా​​​​​​,ఖతార్ : తెలంగాణ ప్రజా సమితి ఖతార్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉచిత వైద్య శిబిరం తేదీ 21-07-2017 రోజున అల్  సుల్తాన్ మెడికల్ సెంటర్  లో ఐసీసీ,  మరియు ఐసీబీఎఫ్ వారి సహకారంతో  నిర్వహించబడినది. 

గల్ఫ్ దేశాలలో ఉండే వేసవి కాలం ఎండ వేడిమి, పని ఒత్తిడి, మరియు ఇతర సమస్యల వల్ల బాధపడే వారు మరియు ముందస్తు జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయించుకోదలచిన అనేక మంది తెలంగాణ  ప్రవాస కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు. మరియు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని వైద్య పరీక్షలు చేపించుకోడానికి వచ్చిన తెలంగాణ ప్రవాస కార్మమికులు తెలిపారు.  

ఈ కార్యక్రమానికి ICC అధ్యక్షురాలు శ్రీమతి మిలన్ అరుణ్ గారు, సభ్యత్వ కార్యదర్శి శ్రీ ప్రసాద్ కోడూరి, ICBF అధ్యక్షుడు శ్రీ డేవిస్ ఎడుకులతుర్ గారు , కార్యదర్శి శ్రీ మహేష్ గౌడ గారు  ముఖ్య అతిధులుగా పాల్గొని తెలంగాణ ప్రజా సమితి ఖతార్ కార్యవర్గం తెలంగాణా కార్మికులకు చేస్తున్న  నిర్విరామ సేవలను కొనియాడారు.ఈ సంధర్భంగా ‌కార్మికులకు రక్త, షుగర్ మరియు వివిధ వైద్య విపుణులతో ఉచిత పరీ్క్షలు నిర్వ‌హించారు. 

అల్ సుల్తాన్ మెడికల్ సెంటర్  జనరల్ మేనేజర్ శ్రీ అక్రమ్ గారు మాట్లాడుతూ కార్మికుల ఆర్ధిక పరిస్తితులకు అనుగుణంగా తక్కువ ధరలకే నాణ్యమైన వైద్యం అందించుటకు తమ వంతుగా మెంబర్షిప్ కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు.దీంతో కార్మికులు 30 రియాల్ లకే కన్సల్టేషన్ మరియు మందుల పై 15% డిస్కౌంట్ పొందగలరని తెలిపారు.

గల్ఫ్ కార్మికుల సంక్షేమం ద్యేయంగా పని చేస్తున్న తెలంగాణ ప్రజా సమితి ఖతార్ ఇక ముందు మరెన్నో సేవ, సాంస్కృతిక కారక్రమాలు  చేపడుతుంది అని కార్యవర్గం పేర్కొంది.

--(రాజ్ కుమార్ వనంబత్తిన,మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com