దసరా పండుగ కు అలరించే చిత్రాలు..!!

- October 20, 2015 , by Maagulf
దసరా పండుగ కు అలరించే చిత్రాలు..!!

తెలుగు ఇండస్ట్రీలో పండుగలు వచ్చాయంటే అగ్ర తారల సినిమాలు పోటీలు పడుతుంటాయి.. ముఖ్యంగా దసర, దీపావళి, సంక్రాంతి పండుగలు వచ్చాయంటే చాలు పెద్ద హీరోల సినిమాలు క్యూ కడుతుంటాయి. పండగ రోజుల్లో దాదాపు స్కూళ్లకు , కాలేజీలకు సెలవులు ఇచ్చేస్తారు..ఖాళీగా ఉంటే ఎంటర్ టైన్ మెంట్ వైపు కామన్ గా దృష్టి మళ్ళీ సినిమా చూసేవారి సంఖ్య పెరుగుతోంది..ప్రేక్షకుల ఇష్టాలను క్యాష్ చేసుకునేందుకు పండగ సీజన్ లే టార్గెట్ గా దర్శకనిర్మాతలు సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. అంతే కాదు ఇప్పుడు వారసుల హవ్వా కొనసాగుతుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఇప్పటికే పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇండస్ట్రీలో మంచి స్థానంలో ఉన్నారు. తాజాగా మరో ఇద్దరు హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చారు వారే సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ..ఇప్పటికే సాయిధరమ్ రెండు హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు 'పిల్లా నువ్వు లేని జీవితం', ' సుబ్రమణ్యం ఫర్ సేల్ ' సినిమాలతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక నాగబాబు కొడుకు వరుణ్ తేజ 'ముకుంద' చిత్రంతో మంచి టాక్ సంపాదించాడు. తాజాగా క్రిష్ దర్శకత్వంలో 'కంచె' చిత్రంతో దసర పండుగ రోజు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ దుమ్ము రేపుతున్నాయి. ఈ నెల దసరా సీజన్ కావడంతో ఇప్పటికే రెండు వారాల ముందు 'రుద్రమదేవి ' బాక్సాపీస్ బరిలో దిగితే..వారం తర్వాత 'బ్రూస్ లీ ' వచ్చి సందడి చేస్తున్నాయి. అయితే దసరా బరిలో దిగాలని చూసిన అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ రేస్ నుంచి తప్పుకున్నాడు. ఇక దసరా బరిలో మరో రెండు సినిమాలు దిగాయి.. అవే 'రాజు గారి గది ' బుల్లి తెరపై తనకుంటూ ఓ ఇమేజ్ సంపాదించిన ఓంకార్ ఈ సినిమా దర్శకులు ఆయన తమ్ముడు హీరో. సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్ తో రూపొందించిన ఈ చిత్రంపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..ఈ సినిమా ట్రైలర్ కూడా బాగానే ఉంది. ఇక మూడో సినిమా కొలంబస్. సుమంత్ అశ్విన్ ,రమేష్ సామల కాంబినేషన్ లో రూపోందిన ఈమూవీ కూడా దసరారోజే రిలీజ్ అవుతోంది.వీటితో పాటు ప్లేయర్ సినిమా, అనువాద సినిమా మరియన్ కూడా దసరా పండక్కి క్యూ కట్టాయి. స్టార్ హవా లేకపోవడం ఈ సినిమాలన్నిటికీ కలిసోచ్చేదే అయినా ఎవరి సినిమా విజయం సాధిస్తుందో తెలియాంటే విజయదశమి కాస్త ఓపిక పట్టాల్సిందే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com