'నేను లోకల్' డైరక్టర్‌ త్రినాథరావు కి ఛాన్స్ ఇచ్చిన రామ్ చరణ్‌

- July 24, 2017 , by Maagulf
'నేను లోకల్' డైరక్టర్‌ త్రినాథరావు కి ఛాన్స్ ఇచ్చిన రామ్ చరణ్‌

ఇప్పుడు ప్రేక్షకుడి ఆలోచన మారింది. మూడు ఫైట్లు, ఆరు పాటలు కోరుకోవడంలేదు. మంచి పాయింట్‌ని తీసుకుని దాన్ని అందంగా, సరదాగా తెరకెక్కిస్తున్న దర్శకులకు పట్టం కడుతున్నారు ప్రస్తుత యువత. ఆ కోణంలోనే వస్తున్న నానీ సినిమాలకు ప్రేక్షకులు వందమార్కులు వేసేస్తున్నారు.  అందుకే వరుస సినిమాలతో మంచి ఫామ్‌లో వున్నాడు నేచురల్ స్టార్ నానీ.  ఇప్పుడు హీరో రామ్ చరణ్‌కూడా నానీ హిట్ మూవీ 'నేను లోకల్' డైరక్టర్ త్రినాథరావు నక్కినకు మంచి స్టోరీ రెడీ చేయమంటూ ఆఫర్ ఇచ్చాడు. ఈ స్టోరీ చరణ్‌కి నచ్చితే, కొరటాల శివ ప్రాజెక్టు తరువాత చెర్రీ ఈ సినిమా చేస్తారని టాలీవుడ్ టాక్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com