డిఫెన్స్‌ ఎగ్జిబిషన్‌ రిజిస్ట్రేషన్‌కి మంచి స్పందన

- July 25, 2017 , by Maagulf
డిఫెన్స్‌ ఎగ్జిబిషన్‌ రిజిస్ట్రేషన్‌కి మంచి స్పందన

 బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ డిఫెన్స్‌ ఎగ్జిబిషన్‌ మరియు కాన్ఫరెన్స్‌ (బిఐడిఇసి) అక్టోబర్‌ 16 నుంచి మూడు రోజులపాటు జరగనుంది. కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు మంచి స్పదన లభిస్తోంది. రాయల్‌ గార్‌&్డ కమాండర్‌, బిఐడిఇసి 2017 హై కమిటీ ఛైర్మన్‌ బ్రిగేడియర్‌ షేక్‌ నాజర్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా ఈ ఈవెంట్‌కి సంబంధించి ఫాలోయింగ్‌ అప్‌ ప్రిపరేషన్స్‌ చూస్తున్నారు. అక్టోబర్‌ 16 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. బహ్రెయిన్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (బిడిఎఫ్‌), బిఐడిఇసి 2017కి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. క్లారియాన్‌ ఈవెంట్స్‌ ఈ ఎగ్జిబిషన్‌ని నిర్వహిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com