ఈ నెల 28 న 'పైసా వసూల్' స్టంపర్ రిలీజ్
- July 25, 2017
నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్ ల సెన్సేషనల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'పైసా వసూల్' . భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి , ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపుకుంటోంది .అది కూడా ఈ వారంలోనే పూర్తి కానుంది . ఈ నెల 28 న 'పైసా వసూల్' కి సంబంధించిన 'స్టంపర్' ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భం గా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - "నందమూరి బాలకృష్ణ తో కలిసి ఫస్ట్ టైమ్ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీ గానూ, గర్వం గానూ ఉంది. నా కెరీర్ లోనే ఇదొక మెమొరబుల్ మూవీ అవుతుంది. బాలకృష్ణ గారు ఈ పాత్ర లో లీనమైన తీరు చూసి వండర్ అయిపోయాను. నందమూరి అభిమానులు కోరుకొనే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయే లెవెల్ లో ఉంటాయి. ఈ సినిమా ఎలా ఉండబోతోందో రేపు 28 న విడుదల కానున్న 'స్టంపర్' చూస్తే అర్థమవుతుంది. రెగ్యులర్ గా అందరూ విడుదల చేసే టీజర్ , ట్రైలర్ కి పూర్తి భిన్నం గా ఈ 'స్టంపర్' ఉంటుంది" అని చెప్పారు.
నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ - " బాలకృష్ణ -పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా గర్వం గా ఫీల్ అవుతున్నాను . మా భవ్య క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా అవుతుంది. ఈ వారం తో ప్యాచ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి కావొచ్చాయి . మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా చురుగ్గా సాగుతూ ,తుది దశకు చేరుకుంటోంది . ఆడియో ఫంక్షన్ ని త్వరలోనే గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.nbk 101
fever begins పేరుతో బాలకృష్ణ గారు ఇప్పటివరకూ నటించిన 100 సినిమాల విశేషాల తో ఒక వీడియో కర్టెన్ రైజర్ రిలీజ్ చేసాం . అది సోషల్ మీడియా లో ఇండియా లెవెల్ లో బాగా ట్రెండింగ్ అవుతోంది. " అని తెలిపారు. శ్రీయ , ముస్కాన్ , కైరా దత్, అలీ,పృథ్వి ,పవిత్రా లోకేష్ ,విక్రమ్ జిత్ తదితరులు నటించిన ఈ చిత్రం లో ప్రముఖ హాలీవుడ్ -బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ ఒక ప్రత్యేక పాత్ర ధరించారు . ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







