హీరో మహేష్‌బాబు 'స్పైడర్' తమిళ రైట్స్ 'లైకా' సొంతం
- July 25, 2017
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'స్పైడర్'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం తమిళ రైట్స్‌ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రోబో చిత్రానికి సీక్వెల్‌గా '2.0' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న 'స్పైడర్' చిత్రంపై అన్ని చోట్ల భారీ అంచనాలు వున్నాయి. దాన్ని దృష్టిలో వుంచుకొని లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి 'స్పైడర్' తమిళ రైట్స్‌ని దక్కించుకుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







