దూసుకొచ్చిన ఇరాన్ యుద్ధనౌక.. కాల్పులు
- July 26, 2017
పర్షియన్ సముద్ర జలాల్లోకి దూసుకొచ్చిన ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా కాల్పులు జరిపింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పర్షియన్ గల్ఫ్ వైపు మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ యుద్ధనౌకను పలుమార్లు ఆగాలని అమెరికాకు చెందిన థండర్‌బోల్ట్ బోటు పలుమార్లు హెచ్చరించింది.
ఇరాన్ నౌక హెచ్చరికలను ఖతరు చేయకపోవడంతో దాన్ని వెంబడించింది. దాదాపు 150 యార్డుల చేరువలో ఇరు ఓడలు సముద్రంలో వెళ్లినట్లు అమెరికా నేవీ వర్గాలు తెలిపాయి. అంత దగ్గరలో ప్రయాణించడం కారణంగా ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించాయి. అప్పటికీ ఇరాన్ నౌక వెనక్క తగ్గకపోవడంతో వరుసగా కాల్పులు జరిపినట్లు వివరించాయి.
అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేరు తెలపడానికి ఇష్టపడని పెంటగాన్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికాకు చెందిన నౌకలు డే టైమ్‌లో విన్యాసాలు నిర్వహిస్తుండగా.. ఇరాన్ నౌక ఈ చర్యకు దిగినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







