ఆ 39 మంది చనిపోయినట్లు ఆధారాలు లేవు సుష్మాస్వరాజ్ వివరణ
- July 26, 2017
ఇరాక్‌లోని మోసుల్‌లో అదృశ్యమైన 39 మంది భారతీయులు చనిపోయినట్లు ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం లోక్‌సభలో తెలియజేశారు. అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విపక్షాలు చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. ‘నా మాటలు అబద్ధం అయితే అదృశ్యమైన 39 మంది భారతీయుల కుటుంబాలను కలవండి, వాళ్లే చెబుతారు. ఇరాక్ కూడా వారంతా చనిపోయినట్లు చెప్పలేదు. దీని గురించి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. వారి గురించి ఎటువంటి సమాచారం లేకుండా నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను’.. అని ఆమె అన్నారు.
అదృశ్యమైన భారతీయుల కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి లోక్‌సభలో చెప్పారు. మోసుల్ ప్రాంతంలో పనిచేసుకుంటున్న భారత్‌కు చెందిన 39 మంది కార్మికులను ఐసిస్ ఉగ్రవాదులు 2014లో బందీలుగా చేసుకున్నారు. ఇటీవల ఇరాక్ భద్రతా బలగాలు మోసుల్‌ను ఐసిస్ చెర నుంచి విడిపించారు. దాంతో వారి వద్ద బందీలుగా ఉన్న 39 మంది జాడ కోసం భారత ప్రభుత్వం తీవ్రంగా వెతుకుతోంది. అయితే..
‘వారంతా వంద శాతం బతికి ఉన్నారా? లేదా? అనేది కచ్చితంగా చెప్పలేమని’ ఇరాక్ విదేశీ మంత్రి ఇబ్రహీం అల్ జఫారి అన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







