నాగ చైతన్య నటించిన 'యుద్ధం శరణం' టీజర్ పోస్టర్ విడుదల
- July 27, 2017
నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘యుద్ధం శరణం’. ఆర్.వి కృష్ణ దర్శకుడు. ఈ చిత్ర టీజర్ పోస్టర్ ఈ రోజు విడుదలైంది. జులై 31న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు పోస్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో నాగచైతన్యకి జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఇదివరకు విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో కేవలం నాగచైతన్య, శ్రీకాంత్‌నే చూపించారు.
ఇప్పుడు విడుదల చేసిన టీజర్ పోస్టర్లో సినిమాలోని పాత్రధారులం దరినీ ‘యుద్ధం శరణం’ అక్షరాల్లో చూపించారు. ప్రేమ, పగ, అభిమానం ఇలా అన్ని భావోద్వేగాలు పోస్టర్లో కన్పిస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రీకాంత్, రేవతి, రావు రమేశ్, మురళి శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్‌లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!









