చిరు నటించిన 'మహానగరంలో మాయగాడు' మళ్లీ వస్తున్నాడు

- July 27, 2017 , by Maagulf
చిరు నటించిన 'మహానగరంలో మాయగాడు' మళ్లీ వస్తున్నాడు

తన స్టైలు, స్టెప్పులు అన్నీ మామయ్యనుంచి పుణికి పుచ్చుకున్నట్లుగా ఉంటాయి సాయి ధరమ్ తేజ్ సినిమాలు. ఇప్పటికే చిరంజీవి రీమిక్స్ పాటల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించాడు కూడా.  ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమా టైటిల్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.  దీనికి మారుతి దర్శకుడిగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం.  ప్రస్తుతం బీవీఎస్ రవి దర్శకత్వంలో వస్తున్న 'జవాన్', ఆ తరువాత వినాయక్, కరుణాకరన్‌లతో వరుస సినిమాలు చేస్తున్నాడు.  ఇవన్నీ పూర్తయినతరువాత 'మహానగరంలో మాయగాడు' టైటిల్‌తో మరోసారి మాస్ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి రడీ అవుతున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com