ఉత్తర బాటినాలో దోపిడీ, ఆ నేర ఆరోపణలపై ఆరుగురు అరెస్ట్

- July 27, 2017 , by Maagulf
ఉత్తర బాటినాలో దోపిడీ, ఆ నేర ఆరోపణలపై ఆరుగురు అరెస్ట్

స్థానిక విలయత్ లోని  లివాలోని ఒక పౌరుడి ఇంటిలోనికి బలవంతంగా ప్రవేశించిన నేరానికి గాను ముగ్గురు వ్యక్తులపై లివా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేరంలో ఒక గల్ఫ్ జాతీయుడితో సహా ముగ్గురు వ్యక్తులను దాడి మరియు దోపిడీ ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర బటినాలోని లివా పోలీస్ స్టేషన్ లో విచారణ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం నుండి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుని ఇంటి లోనికి బలవంతాన ప్రవేశించడమే కాక చెక్క బ్యాటుతో ఆ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచి 2,000  రియల్ ఓమాన్లు, మొబైల్ ఫోన్లు దొంగిలించారు. ఇంకొక కేసులో, విచారణలు మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది షినాస్ ఉత్తర బాటినాహ లోని ఒక పెట్రోల్ బంకులో పనిచేసే కార్మికుడిపై దాడికి పాల్పడి ఆ వ్యక్తిని దోచుకొన్న నేరంలో మరో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు అరెస్టు కాబడిన నిందితులంతా తమ నేరాన్నిఅంగీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com