ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- February 25, 2026
విజయవాడ: హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనం వేదికగా ఫిబ్రవరి 21-24, 2026 వరకు
2025–26 ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొత్తం 23 పతకాలు సాధించింది.వీటిలో 2 బంగారు, 8 వెండి, 3 కాంస్య పతకాలు మరియు 10 మెడలియన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి.
ఇండస్ట్రీ 4.0, ఇండస్ట్రియల్ మెకానిక్స్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, ల్యాండ్ స్కేప్ గార్డెనింగ్ వంటి కీలక మరియు అభివృద్ధి చెందుతున్న రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలు, నైపుణ్య అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ బలాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఈ సందర్భంగా APSSDC ఎండీ & సీఈఓ గణేష్ కుమార్ విజేతలని అభినందిస్తూ, “ఈ విజయాలు యువత యొక్క కృషి, శిక్షకులు మరియు మెంటర్ల మద్దతుకు నిదర్శనం” అని తెలిపారు.అలాగే, ప్రపంచ స్థాయి నైపుణ్యాలను పెంపొందించడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థ కట్టుబడి
ఉందని చెప్పారు.
ఈ విజయానికి కఠినమైన ఎంపిక ప్రక్రియ, ప్రత్యేక శిక్షణ శిబిరాలు,క్రమబద్ధమైన శిక్షణ మరియు నిరంతర మార్గదర్శకత్వం కీలక పాత్ర పోషించాయి. ఇదే ఉత్సాహంతో, రాబోయే ఇండియా స్కిల్స్ నేషనల్ స్థాయి పోటీలకు పోటీదారులను మరింత మెరుగ్గా సిద్ధం చేయడానికి
APSSDC చర్యలు కొనసాగిస్తుంది అని తెలిపారు.

తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







