మహేష్ స్పైడర్: 8 నిమిషాల సీన్ కోసం రూ. 20 కోట్ల ఖర్చు
- July 27, 2017
మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సైడర్' మూవీ విషయంలో నిర్మాతలు పెడుతున్న ఖర్చు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఈ సినిమాలో 8 నిమిషాల సీన్ కోసం రూ. 20 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
'సైడర్' మూవీలో ఓ సీన్లో విలన్ నుండి ప్రజలను కాపాడే సీన్ ఉంటుందని, ఈ సీన్ సినిమా మొత్తానికే మేజర్ హైలెట్ అవుతుందని, చాలా కీలకమైన సీన్ కాబట్టే రూ. 20 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.
1
షూటింగ్ ప్రోగ్రెస్, రిలీజ్ విశేషాలు
'స్పైడర్' సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ మీద ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమేనియాలో ఈ సాంగ్ చిత్రీకరించనున్నారు. పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి విజయదశమి సందర్భంగా సెప్టెంబరు 27 న 'స్పైడర్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
2
భారీ బడ్జెట్
130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పైడర్ లో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా, రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్ర పోషిస్తుంది. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
3
ఊహించని స్పందన
మహేష్, మురుగదాస్ ఫస్ట్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన టీజరకు ఎవరూ ఊహించని విధంగా భారీ స్పందన వచ్చింది. దీన్ని బట్టి సిపిమాపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందుతున్న 'స్పైడర్' చిత్రం సూపర్‌స్టార్ మహేష్ కెరీర్‌లోనే ఒన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుందని టీజర్‌ని చూసిన ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు.
4
స్పైడర్
సూపర్‌స్టార్ మహేష్, రకుల్‌ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాత: ఎన్.వి.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







