జేమ్స్‌ కెమరూన్‌ 'టైటానిక్‌' మరోసారి వస్తోంది

- July 28, 2017 , by Maagulf
జేమ్స్‌ కెమరూన్‌ 'టైటానిక్‌' మరోసారి వస్తోంది

టైటానిక్‌ ఓడ సముద్రంలో మునిగి 105ఏళ్లు దాటినా ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నామంటే హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కెమరూన్‌ తెరకెక్కించిన ‘టైటానిక్‌’ చిత్రమే కారణం. అసలైన టైటానిక్‌ ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఏ సమయానికి ఓడ మంచు కొండను ఢీకొన్నది.. ఎలా మునిగిపోయింది.. ఎంత సమయం పట్టింది లాంటి అంశాలను చూపిస్తూ అందులో ఓ ప్రేమకథను నడిపించారయన. అయితే ఇప్పుడు మరోసారి ఆ టైటానిక్‌ తెరపైకి తెస్తూ.. తను తీసిన చిత్రంలోని లోటుపాట్లపై వివరణ ఇస్తూ టైటానిక్‌పై ఓ డాక్యుమెంటరీ తీయబోతున్నారట.
టైటానిక్‌ చిత్రం విడుదలై గత ఏప్రిల్‌ నెలకు 20ఏళ్లు పూర్తయింది. అయినా ఇప్పటికీ ఆ చిత్రంలోని పలు సన్నివేశాల్లో జరిగిన ఘటనలు స ందేహాలుగానే మిగిలిపోయాయి. వాటికి వివరణ ఇస్తూ.. టైటానిక్‌ చిత్ర విశేషాలు.. చరిత్ర సవివరంగా తెలిపేలా టైటానిక్‌పై గంట నిడివి గల ఒక డాక్యుమెంటరీని రూపొందించనున్నారు. దీని గురించి జేమ్స్‌ మాట్లాడుతూ ‘నేను ‘టైటానిక్‌’ కథ రాసుకున్నప్పుడు.. తెరకెక్కించే సమయంలో నిజమైన టైటానిక్‌లాగే ప్రతీది యథాతథంగా.. సవివరంగా చూపించాలనుకున్నాను. ఎందుకంటే నేను ఒక చరిత్రను మరోసారి రూపొందించా. దీన్ని టైటానిక్‌ ప్రమాదలో మరణించిన వారి గౌరవార్థం చిత్రీకరించా. కానీ నేను అనుకున్నట్టుగానే సినిమాను తీయగలిగానా అని నాకే సందేహం. అందుకే ఇప్పుడు నేషనల్‌ జియోగ్రఫీ ఛానెల్‌ వారితో కలిసి తాజా పరిశోధనలు.. సాంకేతిక సహాయంతో మరోసారి టైటానిక్‌ను కళ్లముందు ఆవిష్కరించబోతున్నా’ని చెప్పుకొచ్చారు.
ఈ డాక్యుమెంటరీ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com