అల్ రయ్యాన్ రోడ్ అప్‌గ్రెడేషన్ దాదాపు పూర్తి
- July 28, 2017
అల్ రయ్యాన్ రోడ్‌కి సంబంధించి అప్‌గ్రెడేషన్ వర్క్ దాదాపు పూర్తి కావచ్చినట్లు అష్గల్ వెల్లడించింది. 22 ఫిబ్రవరి రోడ్ మరియు అల్ రయ్యాన్ రోడ్‌ని కనెక్ట్ చేసే ఫ్లై ఓవర్‌ని జులై 28 నుంచి ఆగస్ట్ 4 వరకు తాత్కాలికంగా మూసివేసి, మిగతా పనులు పూర్తి చేయనున్నట్లు అష్గల్ ప్రకటించింది. ఈ మూసివేత కారణంగా 22 ఫిబ్రవరి రోడ్‌పై సౌత్‌బౌండ్ మీదుగా ప్రయాణించే వాహనదారులు అల్ రయ్యాన్ ఫ్లైవోర్‌కి ముందుగా ఉన్న సర్వీస్‌రోడ్ వైపు ఎగ్జిట్ తీసుకోవాలి. మూడో ఎగ్జిట్‌ని తీసుకుని, అలింపిక్ రౌండెబౌట్ వైపుగా వారు వెళ్ళవలసి ఉంటుంది. ఈ డైవర్షన్ కారణంగా వాహనదారులు గంటకు 50 కిలోమీటర్ల వేగానికి లోబడి తమ వాహనాల్ని నడపాల్సి ఉంటుంది, అలాగే సూచకల ప్రకారం ప్రయాణించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు ఉండవని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







