తక్కువ ఆదాయం గల కార్మికులకు ఉచిత మెడికల్ సర్వీస్‌లు
- July 28, 2017
దర్ అల్ బెర్ సొసైటీ, దుబాయ్ మరియు షార్జాలోని జులేఖా హెల్త్‌కేర్ గ్రూప్‌తోనూ, ఇండియాలోని అలెక్సిస్ హాస్పిటల్‌తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పదం ప్రకారం తక్కువ ఆదాయం గల వారికి ఉచితంగా వైద్య సేవలను అందించనున్నారు. ఇయర్ ఆఫ్ గివింగ్ ఇనీషియేటివ్‌లో భాగంగా ఈ సేవా కార్యక్రమం చేపడుతున్నట్లు సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్లా అలి బిన్ జాయెద్ అల్ ఫలాసి చెప్పారు. కిడ్నీ ఫెయిల్యూర్ సహా ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పేదలకు జులేకా, అలెక్సిస్ హాస్పిటల్స్ సేవలందిస్తాయని ఆయన తెలిపారు. దర్ అల్ బెర్ సొసైటీ రిఫర్ చేసిన రోగులకు 10 నుంచి 25 శాతం ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు జులేకా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తహెర్ షామ్స్ చెప్పారు. జులేకా హెల్త్ కేర్ గ్రూప్ ఓనర్ డాక్టర్ జులేకా ఇక్బాల్ దావూద్ మాట్లాడుతూ, ఈ తరహా సేవా కార్యక్రమాలక తమ వంతు మద్దతు ఖచ్చితంగా ఉంటుందని అన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







