సుష్మాస్వరాజ్ అంటే భారతీయులే కాదు పాకిస్తాన్ వాళ్ళకి కూడా ఇష్టమే
- July 28, 2017
కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ సాయం చేసే గుణానికి మన భారతీయులే కాదు పాకిస్థానీలూ ఫిదా అయిపోయారు. తాజాగా ఓ పాక్ మహిళకి సుష్మా సకాలంలో సాయం చేసి ఆదుకున్నారు. దాంతో ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనై సుష్మాను పొగడ్తలతో ముంచెత్తుతోంది.
హిజాబ్ అసీఫ్ అనే మహిళ కాలేయ సమస్యతో బాధపడుతోంది. వెంటనే ఆమె భారత్‌లో చికిత్స చేయించుకోవాల్సి ఉంది. ఇందుకోసం హిజాబ్ మెడికల్ వీసా కోసం ఇస్లామాబాద్‌లోని డిప్యూటీ హైకమిషనర్‌ను ఆశ్రయించింది. కానీ ఇందుకు కమిషనర్ ఒప్పుకోలేదు. దాంతో హిజాబ్ సుష్మా స్వరాజ్‌ను ఆశ్రయించింది.
‘మేడమ్.. నాకు కాలేయ సమస్య ఉంది. భారత్‌లో చికిత్స చేయించుకోవాలి. మెడికల్ వీసా కావాలని అడిగితే అది మీరే చూసుకోవాలని అంటున్నారు. నాకు సాయం చేయండి’ అని ట్వీట్‌చేసింది. ఎప్పటిలాగే వెంటనే స్పందించిన సుష్మా.. మెడికల్ వీసా వచ్చేలా డిప్యూటీ హైకమిషనర్‌ను ట్విటర్లో ఆదేశించింది.
వెంటనే స్పందించి తనకు సాయం చేసిన సుష్మాపై హిజాబ్ ప్రశంసల జల్లులు కురిపించింది. ‘సుష్మాజీ.. ఏమని పిలవను మిమ్మల్ని? సూపర్విమెన్ అనాలా లేక దేవత అని సంబోధించాలా? మీ మంచితనాన్ని వివరించడానికి మాటలు రావడంలేదు. లవ్యూ మేడమ్. కన్నీళ్లతో మిమ్మల్ని పొగడటం ఆపలేను. నా గుండె మీకోసమే కొట్టుకుంటోంది.మీరు మా ప్రధాని అయివుంటే ఎంత బాగుండో. అయినా మీలాంటి ప్రధానిని పొందే అర్హత పాక్‌కు లేదు’ అని ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







