'నాయకుడు' గా కమల్
- July 28, 2017
కమల్‌హాసన్ రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. అధికారికంగా ఎటువంటి ప్రకటనలు రాకపోయినా.. ఆ నేపథ్యంలో కమల్ హాసన్ చేసే ట్వీట్స్ కూడా కాస్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కమల్ చేస్తున్న కొత్త సినిమాకు 'తలైవన్ ఇరుక్కిఱాన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇంతకీ ఈ టైటిల్ అర్ధమేంటో తెలుసా.. 'నాయకుడు ఉన్నాడు' అని. పూర్తి రాజకీయ నేపథ్యంలో ఈకథాంశం ఉండబోతుందని తెలిసింది. చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడట. చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో విడుదలచేయనున్నారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ నటించిన 'విశ్వరూపం 2', 'శభాష్ నాయుడు' చిత్రాలు ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







