జర్మనీలోని హాంబర్గ్‌లో కత్తిదాడి కలకలం
- July 29, 2017
తరచుగా జరుగుతున్న ఉగ్రదాడులతో ఐరోపా దేశాలు బిక్కుబిక్కుమంటున్న వేళ.. జర్మనీలోని హాంబర్గ్‌లో ఓ దుండగుడు జరిపిన కత్తిదాడి కలకలం రేపింది. హాంబర్గ్‌లోని ఓ సూపర్ మార్కెట్ వద్ద జరిగిన ఈ దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన అనంతరం దుండగుడు పారిపోతుండగా స్థానికులు కుర్చీలు, కర్రలతో దాడి చేసి అతన్ని బంధించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు దాడి సమయంలో అల్లహో అక్బర్ అంటూ అరిచినట్లు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి ఉద్దేశం ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కత్తి దాడి నేపథ్యంలో జర్మనీలో భద్రతను పటిష్ఠం చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







