అట్లాంటిక్ సముద్రంపై ప్రసవం ప్రశాంతం
- July 29, 2017
ఓ మహిళ నింగిలో అదీ కూడా భూమికి 39 వేల అడుగుల ఎత్తులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం ఎల్‌హెచ్ 543 కొలంబియాలోని బోగోటా నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరింది. ఈ విమానం నింగిలో భూమికి 39,000 అడుగుల ఎత్తున రయ్‌మంటూ దూసుకెళుతోంది. ఈ విమానంలో నిండు గర్భంతో ఉన్న 38 ఏళ్ల ప్రయాణికురాలు కూడా ప్రయాణం చేస్తోంది. ఈమెకు అకస్మాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. దీంతో వెంటనే ఆ విమానాన్ని మాంచెస్టర్‌కు దిశ మార్చారు. అదృష్టవశాత్తూ అదే విమానంలో ముగ్గురు డాక్టర్లు ఉండటం ఆ మహిళకు వరంగా మారింది. వైద్యులు, క్యాబిన్ సిబ్బంది సాయంతో మహిళకు సుఖ ప్రసవం చేశారు. మగ శిశువు విమానంలో కళ్లు తెరిచాడు. సదరు మహిళ పేరు దేశిస్ లావా కాగా, పూర్తిగా నెలలు నిండక ముందే ప్రసవం జరిగింది. విమానంలో ప్రయాణికులను ముందుకు పంపి, వెనుక వైపు ప్రసవం కానిచ్చేశారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







