ఆగస్ట్ 11 సినిమా రానున్న రానా సినిమా

- July 29, 2017 , by Maagulf
ఆగస్ట్ 11 సినిమా రానున్న రానా సినిమా

వరసగా నాలుగు రోజులు శలవలు రావడం తో టాలీవుడ్ సినిమాకి ఇప్పుడు ఆగస్ట్ 11 తేదీ అతిపెద్ద విశేషంగా మారింది. పోటీ ఎక్కువ ఉన్నా సరే తమ సినిమాలు రంగంలోకి దింపాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుంది టాలీవుడ్ . లాంగ్ వీకెండ్ దెబ్బకి మనోళ్ళు పోటా పోటీగా సినిమాలు దింపే పనిలో పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సినిమాలు ఆ రోజు విడుదల కి సిద్దం అవుతున్నాయి. జయ జానకీ నాయక, లై , నేనే రాజు నేనే మంత్రి సినిమాల విడుదల తేదీ అదే రోజు ఫిక్స్ చేసారు.
ఈ మూడు సినిమాల మీదా భారీగా అంచనాలు ఉండడం విశేషం. బోయపాటి శ్రీను సినిమా మీద సహజంగా మాస్ దృష్టి ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. ప్రమోషన్ లూ ట్రైలర్ లూ బాగుండడం తో నేనే రాజు నేనే మంత్రికి ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది. ఇక లై సినిమా ప్రమోషన్ మొదలు కూడా కాలేదు. నితిన్ కొత్త గెటప్ లో కనిపించడం మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకి పాజిటివ్ లు కావచ్చు.
పైగా యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ పాత్ర కూడా చేసాడు మరి. సాధార‌ణంగా బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఒక‌ట్రెండు సినిమాల‌కే చోటుంది. కాక‌పోతే.. సెల‌వ‌లు వ‌స్తున్నాయి కాబ‌ట్టి, ఈ గ్యాప్‌ని క్యాష్ చేసుకోవాల‌న్న ఉద్దేశంతో మూడు సినిమాలూ స‌మ‌ర‌శంఖం పూరించాయి. వీటిలో గెలుపు ఎవ‌రిదైనా…. సినీ అభిమానుల‌కు మాత్రం అస‌లైన మ‌జా అంద‌డం ఖాయం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com