హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. మరో బాంబు పేల్చబోతున్న సిట్
- July 29, 2017
డ్రగ్స్ కేసుకు సంబంధించి కొనసాగుతున్న టాలీవుడ్ ప్రముఖుల విచారణ దాదాపుగా క్లైమాక్స్‌కు చేరింది. ఇంకా ఈ కేసుకు సంబంధించి సినీ పరిశ్రమకు చెందిన ఒకరిద్దరిని మాత్రమే విచారించాల్సి ఉంది. దీంతో సిట్ తర్వాత టార్గెట్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డ్రగ్స్ వాడుతున్న వారిలో సినీ ప్రముఖులతో పాటు కొందరు రాజకీయవ్యాపారవేత్తలు, ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నారని సిట్ భావిస్తోంది. ఇప్పటికే 13 ఐటీ కంపెనీలకు సిట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో చాలామందికి డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నట్లు సిట్ అనుమానిస్తోంది. డ్రగ్స్ వాడుతున్న ఉద్యోగుల వివరాలను సిట్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఐటీ ఉద్యోగుల్లో కొందరు ఒత్తిడికి లోనై డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని సిట్ అధికారులు తేల్చారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







