ఆగస్ట్ 11 సినిమా రానున్న రానా సినిమా
- July 29, 2017
వరసగా నాలుగు రోజులు శలవలు రావడం తో టాలీవుడ్ సినిమాకి ఇప్పుడు ఆగస్ట్ 11 తేదీ అతిపెద్ద విశేషంగా మారింది. పోటీ ఎక్కువ ఉన్నా సరే తమ సినిమాలు రంగంలోకి దింపాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుంది టాలీవుడ్ . లాంగ్ వీకెండ్ దెబ్బకి మనోళ్ళు పోటా పోటీగా సినిమాలు దింపే పనిలో పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సినిమాలు ఆ రోజు విడుదల కి సిద్దం అవుతున్నాయి. జయ జానకీ నాయక, లై , నేనే రాజు నేనే మంత్రి సినిమాల విడుదల తేదీ అదే రోజు ఫిక్స్ చేసారు.
ఈ మూడు సినిమాల మీదా భారీగా అంచనాలు ఉండడం విశేషం. బోయపాటి శ్రీను సినిమా మీద సహజంగా మాస్ దృష్టి ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. ప్రమోషన్ లూ ట్రైలర్ లూ బాగుండడం తో నేనే రాజు నేనే మంత్రికి ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది. ఇక లై సినిమా ప్రమోషన్ మొదలు కూడా కాలేదు. నితిన్ కొత్త గెటప్ లో కనిపించడం మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకి పాజిటివ్ లు కావచ్చు.
పైగా యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ పాత్ర కూడా చేసాడు మరి. సాధారణంగా బాక్సాఫీసు దగ్గర ఒకట్రెండు సినిమాలకే చోటుంది. కాకపోతే.. సెలవలు వస్తున్నాయి కాబట్టి, ఈ గ్యాప్‌ని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మూడు సినిమాలూ సమరశంఖం పూరించాయి. వీటిలో గెలుపు ఎవరిదైనా…. సినీ అభిమానులకు మాత్రం అసలైన మజా అందడం ఖాయం.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







