అబుధాబీ- అల్ ఘ్వేయ్ ఫత్ రోడ్డుపై వేగపరిమితి తగ్గింపు

- October 20, 2015 , by Maagulf
అబుధాబీ- అల్ ఘ్వేయ్ ఫత్ రోడ్డుపై వేగపరిమితి తగ్గింపు

 

 

ఈ సంవత్సరం నవంబరు 15వ తేదీ నుండి అబుధాబీ- అల్ ఘ్వేయ్ ఫత్ రోడ్డుపై, బారాకా నుండి బేనునా అరణ్యం వరకు గల మార్గంలో వాహనాల వేగపరిమితి 140 కి. మీ.గం. నుండి 120 కి. మీ.గం.  కి తగ్గిస్తున్నట్టు అబుధాబీ పోలీసు శాఖ ప్రకటించింది. ఈ సవరించబడిన  వేగపరిమితి ప్రకారం రాడార్లు పనిచేస్తాయని పోలీసు శాఖ వారు తమ ట్విటర్ ఖాతా ద్వారా హెచ్చరించారు. ఈ సెప్టెంబరు 15 నుండి అక్టోబరు  18 వ తేదీ వరకు గల కాలపరిధిలో పోలీసు శాఖ వారు 6,000 మంది డ్రైవర్లకు సీటు బెల్టు పెట్టుకోనందుకు జరిమానా విధించినట్టు నివేదిక ద్వారా తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com