నాన్నకు ప్రేమతో
- October 21, 2015
నందమూరి అభిమానులు దసరాతో పాటు మరో పండుగకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'నాన్నకు ప్రేమతో' విజయదశమి రోజు, గురువారం సాయంత్రం 6 గంటలకు ఫస్ట్ టీజర్ రిలీజ్ కానుంది. టెంపర్ సక్సెస్ తో మంచి ఫాంలో ఉన్న జూనియర్ ఈ సినిమా కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. 'వన్' ఫెయిల్యూర్ తరువాత డైరెక్టర్ సుకుమార్ చేస్తున్న సినిమా కావటం కూడా మూవీపై అంచనాలు పెంచేస్తుంది. తన హీరోల లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే సుకుమార్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్టీఆర్ ను సరికొత్తగా చూపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావటంతో టీజర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా కాన్సెప్ట్ రివీల్ చేయకపోయినా గ్రాండ్ విజువల్స్ తో అంచనాలు పెంచేలా ఈ టీజర్ ఉంటుదన్న టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు నెగెటివ్ రోల్ లో అలరించనున్నాడు. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







