విమానంలో చిందేసిన షారుక్‌, అనుష్క

- July 30, 2017 , by Maagulf
విమానంలో చిందేసిన  షారుక్‌, అనుష్క

షారుక్‌ ఖాన్‌, అనుష్క శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’. ఈ చిత్రంలో ‘బటర్‌ఫ్లై’ పాట ఇప్పటికే సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. శనివారం అనుష్క, షారుక్‌ ప్రచార కార్యక్రమం నిమిత్తం దుబాయ్‌కి ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో విమానంలో వెళుతూ అక్కడ బటర్‌ఫ్లై పాటకు డ్యాన్స్‌ చేశారు. 

ఈ వీడియోను షారుక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈవీడియోకి వేలకొద్ది లైకులు, కామెంట్లు వస్తున్నాయి. అనుష్క-షారుక్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. ‘రబ్‌నే బనాది జోడీ’, ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ చిత్రాల్లో ఇద్దరూ జంటగా నటించారు. ఇంతియాజ్‌ అలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే శుక్రవారం విడుదల కాబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com