హాలీవుడ్ టీవీ సీరీస్ లో స్టార్ హీరోయిన్స్
- July 30, 2017
త్వరలో హాలీవుడ్‌లో ఓ కామెడీ టీవీ సిరీస్ కోసం ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్‌లు కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ టీవీ సిరీస్ మాధురీ దీక్షిత్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే హాలీవుడ్‌లో 'క్వాంటికో' సిరీస్ ద్వారా యాక్షన్ యాంగిల్ చూపించిన ప్రియాంక, ఈ టీవీ సిరీస్ ద్వారా తనలోని కామెడీ కోణం చూపించనుంది.
ఈ టీవీ సిరీస్‌కు ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్ లు కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సిరీస్ కోసం బాలీవుడ్ స్క్రీన్‌రైటర్ శ్రీ రావు ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని శ్రీ రావు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇద్దరు గ్రేట్ యాక్టర్స్ నా నెక్ట్స్ ప్రాజెక్టు చేయబోతున్నాను అంటూ మాధురీ, ప్రియాంకలతో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు శ్రీరావ్. ఈ సీరీస్ ను క్వాంటికో ను టెలికాస్ట్ చేస్తున్న ఏబీసీ చానల్ ప్రసారం చేయనుంది.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







