విమానంలో చిందేసిన షారుక్, అనుష్క
- July 30, 2017
షారుక్ ఖాన్, అనుష్క శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’. ఈ చిత్రంలో ‘బటర్‌ఫ్లై’ పాట ఇప్పటికే సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. శనివారం అనుష్క, షారుక్ ప్రచార కార్యక్రమం నిమిత్తం దుబాయ్‌కి ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో విమానంలో వెళుతూ అక్కడ బటర్‌ఫ్లై పాటకు డ్యాన్స్ చేశారు.
ఈ వీడియోను షారుక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈవీడియోకి వేలకొద్ది లైకులు, కామెంట్లు వస్తున్నాయి. అనుష్క-షారుక్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఇది. ‘రబ్నే బనాది జోడీ’, ‘జబ్ తక్ హై జాన్’ చిత్రాల్లో ఇద్దరూ జంటగా నటించారు. ఇంతియాజ్ అలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే శుక్రవారం విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







