సెప్టెంబర్ 1 నుండి 'పైసా వసూల్'
- July 30, 2017
నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న సినిమా పైసా వసూల్. ఇటీవల విడుదలైన ఈ సినిమా స్టంపర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పుడు పూరి టీం బాలయ్య అభిమానులకు మరో శుభవార్త చెప్పింది. పైసా వసూల్ ను సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాత వి. ఆనందప్రసాద్ ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతమందించిన పాటల్ని అతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ 'నందమూరి అభిమానులు కోరుకునే అంశాలన్నీ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. బాలకృష్ణగారు ఫుల్ ఎనర్జిటిక్ పాత్రలో ఇరగదీసి నటించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లను ఆయన డూప్ లేకుండా చేశారు. ఇప్పటివరకు ఆయన్ను చూడని విధంగా, ఓ కొత్త పాత్రలో ఇందులో చూస్తారు. తొలిసారి బాలకృష్ణగారితో పని చేస్తున్నందుకు గర్వంగానూ, ఆనందంగానూ ఉంది. మా నిర్మాత ఆనందప్రసాద్‌గారు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమా బాగా రావడానికి కృషి చేశారు' అన్నారు.
నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ 'ఇటీవల విడుదలైన పైసా వసూల్ స్టంపర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. తమ్ముడూ... నేను జంగిల్ బుక్ సినిమా చూడల. కాని అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి, మందేసిన మదపుటేనుగునిరా! క్రష్ ఎవ్రీవన్' డైలాగులు అభిమానులను అలరిస్తున్నాయి. సినిమా కూడా ఇదే రేంజ్లో ఉంటుంది. సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బాలకృష్ణగారి ఇమేజ్‌కి, కథకు తగ్గ పాటలను అందించారు. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం', అన్నారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









