అల్ అయిన్‌లో ఆగస్ట్ నుంచి పెయిడ్ పార్కింగ్
- July 30, 2017
అల్ అయిన్‌లో పెయిడ్ పార్కింగ్ ఆగస్ట్ నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని అబుదాబీ ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ రెగ్యులేటర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ మునిసిపల్ ఎఫైర్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 121 పెయిడ్ పార్కింగ్ ప్రాంతాల్ని నగర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. పార్కింగ్ మీటర్స్‌ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లిమిటెడ్ పార్కింగ్ స్పాట్స్ దుర్వినియోగాన్ని కూడా ఈ పెయిడ్ పార్కింగ్‌తో అరికట్టవచ్చునని అధికారులు చెబుతున్నారు. అల్ కసాదేష్ ప్రాంతంలో 1,376 పార్కింగ్ స్పేసెస్ అందుబాటులో ఉన్నాయి. అల్ రబెనాలో 1,175, అల్ నవాస్‌లో 1,107, అల్ హమిరాలో 1,166, అల్ సలామాలో 867 పార్కింగ్ స్పేసెస్‌ని అందుబాటులో ఉంచారు. వ్యాలీడ్ రెసిడెన్సీ వీసాతోపాటుగా పాస్‌పోర్ట్ కాపీని, టెనెన్సీ కాంట్రాక్ట్‌నీ, ఇటీవలి యుటిలిటీబిల్, వెహికిల్ ఓనర్‌షిప్‌కి సంబంధించిన ప్రూఫ్ సమర్పించి పార్కింగ్ పర్మిట్‌ని పొందవచ్చు. ప్రతి వలసదారుడికి సంబంధించి 2 రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్స్ ఇస్తారు. ఏడాది కాలానికిగాను 800 దిర్హామ్‌లు తొలి కారుకి, రెండో కారుకి 1,200 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







