వైమానిక దళ విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం 12 హైవేలు
- July 31, 2017
అత్యవసర సమయాల్లో రహదారులపై వైమానిక దళ విమానాలను దించేందుకు 12 జాతీయ రహదారులకు భారతీయ వాయుసేన అనుమతి ఇచ్చింది. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి విమానాలు త్వరగా చేరుకోవడానికి ఈ చర్యలు ఉపయోగపడుతాయని ఎయిర్‌ఫోర్స్ ప్రతినిధులు తెలిపారు.
విమానాలు దిగేందుకు వీలుగా మొత్తం 21 జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని తొలుత ప్రతిపాదించినప్పటికీ.. చివరికి 12 రహదారులకు మాత్రమే అనుమతి లభించింది. వీటిలో మూడు రహదారులు మావోయిస్టు ప్రభావిత, వరద ప్రభావిత ప్రాంతాలైన ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. విమానాలు దిగేందుకు వీలుగా రహదారులపై తారు మందాన్ని పెంచి వాటిని మరింత దృఢంగా తయారు చేయనున్నారు.
‘ప్రస్తుతం 12 జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం, మిగతావాటికి త్వరలోనే అనుమతి లభిస్తుంది. సాధారణ సమయాల్లో ఈ రహదారులపై ట్రాఫిక్‌ను అనుమతిస్తాం. అత్యవసర సమయాల్లో మాత్రం వాహన రాకపోకలను నలిపివేసి విమానాలు దిగేందుకు ఏర్పాట్లు చేస్తాం. ఆ సమయంలో వాహన రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తాం.’ అని ఐఏఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
2016 నవంబర్‌లో వాయుసేనకు చెందిన జెట్ విమానాలు లఖ్‌నవూ-ఆగ్రా రహదారిపై దిగిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









