చండీగఢ్ లో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికి గూగుల్‌లో ఉద్యోగం, వేతనం రూ.12 లక్షలు
- July 31, 2017
నాలాంటి యావరేజ్ విద్యార్థికి గూగూల్‌లో ఉద్యోగం వస్తుందని ఎవరు అనుకుంటారు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఓ విధంగా నా కల నిజం అయింది. నా కష్టానికి తగిన ఫలితం దక్కింద'న్నాడు హర్షిత్ శర్మ అనే పన్నెండో తరగతి విద్యార్థి.
హర్షిత్ శర్మ గూగుల్‌లో గ్రాఫిక్ డిజైనర్ ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాడు. ఇతను చండీగఢ్ సెక్టార్ 33-బిలో గల ప్రభుత్వ మోడల్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థి. పన్నెండో తరగతి చదువుతున్నాడు.
ప్రారంభంలో ఏడాది పాటు స్టయిఫాండ్ కింద అతనికి గూగుల్‌లో నెలకు రూ.4 లక్షలు వస్తాయి. ఈ సమయంలో అతను ట్రెయినీ గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేస్తాడు. ట్రెయినింగ్ పీరియడ్ పూర్తయ్యాక నెలకు రూ.12 లక్షల రెమ్యునరేషన్ ఉంటుంది.
1
ఆగస్ట్ 7న కాలిఫోర్నియాకు
చండీగఢ్‌కు చెందిన ఓ పత్రికతో హర్షిత్ శర్మ మాట్లాడాడు. పదేళ్ల వయస్సు నుంచే తాను డిజైనింగ్‌పై ఎలా దృష్టి పెట్టి నేర్చుకున్నానో చెప్పాడు. గూగుల్‌లో పని చేయాలనేది తన లక్ష్యమని చెప్పాడు. అందుకు తగినట్లు కష్టపడ్డానని, తన కల నిజమైందన్నాడు. ఆగస్ట్ 7వ తేదీన హర్షిత్ శర్మ కాలిఫోర్నియాకు వెళ్తాడు.
2
ఏ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందకుండానే
గూగుల్‌లో ఉద్యోగం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదని, తాను పదేళ్ల వయస్సు నుంచే డిజైనింగ్ పైన దృష్టి పెట్టానని, తనకు తన అంకుల్ రోహిత్ శర్మ నేర్పించాడని హర్షిత్ శర్మ చెప్పాడు. ఆ తర్వాత ఇది తనకు అభిరుచిగా మారిందన్నాడు. తాను గూగుల్‌లో జాబ్ కొట్టాలన్న లక్ష్యంతో పని చేశానని చెప్పాడు. మా అంకుల్ తనకు శిక్షణ ఇచ్చాడని, ఏ ఇనిస్టిట్యూట్‌లో తాను జాయిన్ ట్రెయిన్ కాలేదని చెప్పాడు.
3
అప్పుడే రూ.50 వేలు సంపాదించా
నేను క్లాస్ XI జాయిన్ కాగానే ఐటీ స్ట్రీమ్ ఎంచుకున్నానని హర్షిత్ శర్మ చెప్పాడు. గ్రాఫిక్ డిజైనర్ కావాలని ఉందని తన తల్లిదండ్రులకు చెప్పానన్నాడు. పాఠశాలలో చదివినప్పుడే తాను బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల పోస్టర్లను తయారు చేయడం ద్వారా రూ.40 వేల నుంచి రూ.50 వేలు సంపాదించానని చెప్పాడు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో అతని ప్రతిభకుగాను పిఎంవో నుంచి రూ.7,000 గెలుచుకున్నాడు.
4
దరఖాస్తు చేసాడు, జాబ్ కొట్టేశాడు
గత ఏడాది డిసెంబర్ నెలలో హర్షిత్ శర్మ గూగుల్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. అతని అద్భుత డిజైన్ల కారణంగా సెలక్ట్ అయ్యాడు. అతనికి జూన్ నెలలో అపాయింటుమెంట్ లెటర్ పంపించింది. హర్షిత్ గూగుల్ ఉద్యోగానికి సెలక్ట్ అయినందుకు ఆనందంగా ఉందని ప్రిన్సిపల్ ఇందిరా బేనీవాల్ అన్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







