అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ ఇరాక్ ఎంబసీ సమీపంలో పేలుడు
- July 31, 2017
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. కాబూల్లోని ఇరాక్ దౌత్యకార్యాలయానికి సమీపంలో సోమవారం బాంబు పేలుడు సంభవించింది. స్థానిక పోలీస్ కంపౌడ్లోకి చొరబడ్డ కొందరు దుండగులు కారుబాంబుతో ఆత్మాహుతికి పాల్పడ్డారు. అనంతరం మరికొందరు దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంబసీ సమీపం నుంచి భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెప్పారు. పేలుడు అనంతరం కాల్పుల శబ్దాలు కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







