అజ్మన్‌లో రెండో ఫేజ్ పెయిడ్ పార్కింగ్ ప్రారంభం
- July 31, 2017
అల్ ఇత్తిహాద్ రోడ్‌పై రెండో ఫేజ్ పెయిడ్ పార్కింగ్ సిస్టమ్ యాక్టివేట్ చేసినట్లు అజ్మన్ మునిసిపాలిటీ సీనియర్ అధికారి వెల్లడించారు. మునిసిపాలిటీకి చెందిన ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ డాక్టర్ మొహమ్మద్ బిన్ ఒమైర్ మాట్లాడుతూ, రెండు ఫేజ్‌లలో అల్ ఇత్తిహాద్ రోడ్డుపై పెయిడ్ పార్కింగ్ సిస్టమ్‌ని అమలు చేసినట్లు తెలిపారు. 2016లో తొలి దశ పార్కింగ్ ప్రారంభమయ్యింది. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పార్కింగ్ సమస్యపై స్థానికులు వ్యక్తం చేసిన అభ్యంతరాల నేపథ్యంలో మునిసిపాలిటీ తగు చర్యలు చేపట్టింది. ఉదయం వేళల్లో గంటకు 2 దిర్హామ్‌లు, రాత్రి వేళల్లో గంటకు 1 దిర్హామ్ పార్కింగ్ ఫీజుగా వసూలు చేస్తారు. పార్కింగ్ స్థలాల దుర్వినియోగం జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని ఇన్‌స్పెక్టర్స్ పర్యవేక్షిస్తుంటారు. మై స్మార్ట్ లొకేషన్ ద్వారా మోటరిస్టులు పార్కింగ్ ఫీజులను చెల్లించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







