మహిళా క్రికెటర్ మిథాలీరాజ్‌కి బీఎండబ్ల్యూ కారు అందజేత
- August 01, 2017
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు సారథి మిథాలీరాజ్‌కు తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ బీఎండబ్ల్యూ కారును కానుకగా అందజేశారు. గోపీచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాముండేశ్వరినాథ్.. మిథాలీ రాజ్‌కి కారు తాళాలు అందించారు. ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్లో విజయం సాధించిన అనంతరం చాముండేశ్వరినాథ్.. సారథి మిథాలీకి బీఎండబ్ల్యూ కారును అందజేస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గోపిచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మిథాలీకి కారును అందజేశారు. 2016లో రియో ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన పీవీ సింధు, సాక్షి మాలిక్, తృటిలో పతకం చేజార్చుకున్న దీప కర్మాకర్, సింధు కోచ్ గోపిచంద్‌కి చాముండేశ్వరినాథ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కార్లు అందజేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









