జైలు తప్పించుకునేందుకు 72,000 బహ్రెయినీ దినార్స్ చెల్లించిన మాజీ మంత్రి
- August 01, 2017
మనామా: మాజీ మంత్రి, 72,000 బహ్రెయినీ దినార్స్ చెల్లించేందుకు సమ్మతించారు. జైలు శిక్ష తప్పించుకునేందుకు ఈ మొత్తం చెల్లించడానికి ఆయన ముందుకొచ్చారు. కుమారుడి మరణం తర్వాత, ఆ కుమారుడి భార్య అలాగే ఆమె కుమార్తెని అక్కున చేర్చుకునేందుకు నిరాకరించడంతో అతనికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. నిందితుడు తన కుమారుడు మరణించడానికి కొద్ది గంటల ముందే కోడల్ని ఇంట్లోంచి బయటకు గెంటివేయగా, ఆమెకు ఓ అమ్మాయి జన్మించింది. ఈ కారణంగా బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మృతుడికి సంబంధించిన వస్తువుల్ని పబ్లిక్ ఆక్షన్‌లో పెట్టి, తద్వారా వచ్చిన సొమ్ముని బాధితురాలికి అప్పగించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఆక్షన్‌లో మొత్తం 145,000 బహ్రెయినీ దినార్స్ రాగా ఆ మొత్తాన్ని బాధితురాలికి ఇచ్చేందుకు నిరాకరించాడు నిందితుడు. న్యాయస్థానం జోక్యంతో నిందితుడు మిగతా మొత్తం చెల్లించడానికి అంగీకరించాడు.
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







