షార్జా: 33 ఫుడ్ ఔట్‌లెట్స్‌కి జరీమానా
- August 01, 2017
అల్ దైద్ మునిసిపాలిటీ 33 ఫుడ్ ఔట్‌లెట్స్‌కి జరీమానాలు విధించగా, 93 ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కి వార్నింగ్ ఇచ్చింది. పబ్లిక్ హెల్త్ కండిషన్స్, రెగ్యులేషన్స్‌కి సంబంధించి ఈ చర్యలు తీసుకున్నట్లు అల్ దైద్ మునిసిపాలిటీ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అహ్మద్ ముస్సాబా అల్ తునైజి చెప్పారు. ఈ వేసవిలో 149 ఎస్టాబ్లిష్మెంట్స్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గ్రాసరీస్, సూపర్ మార్కెట్, కెఫెటేరియాస్, రెస్టారెంట్స్ ఇందులో ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఈ తనిఖీలను నిర్వహించడం జరిగింది. ఆహార పదార్థాల్ని తయారు చేసే క్రమంలో, వాటిని విక్రయించే క్రమంలో ఆయా ఎస్టాబ్లిష్మెంట్స్లో సిబ్బంది భద్రతా ప్రమాణాలు, హెల్త్ కండిషన్స్, పరిశుభ్రత పాటించాలని ఈ సందర్భంగా అహ్మద్ ముస్సబా హెచ్చరించారు. ఎయిర్ కండిషన్లను ఆపివేయడం, రాత్రి వేళ్ళలో రిఫ్రిజిరేటర్లను ఆపివేయడం వంటి చర్యల ద్వారా ఆహార పదార్థాలు పాడైపోతున్నట్లు గుర్తించినట్లు ఆయన వివరించారు. ఎప్పటికఫ్పుడు తనిఖీలు జరుగుతుంటాయి గనుక ఆయా సంస్థల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలనీ, పరిశుభ్ర వాతావరణంలో వినియోగదారులకు ఫుడ్ ఐటమ్స్ సప్లయ్ చేయాలని స్పష్టం చేశారు అల్ తనైజి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







