త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ!
- August 01, 2017
కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారు అయింది. వచ్చే నెల (ఆగస్టు)లో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. కొత్తగా పలువురికి కేబినెట్ బెర్త్‌లు దక్కనున్నాయి. అలాగే మంత్రుల శాఖల్లోనూ మార్పులు, చేర్పులు జరగే అవకాశం ఉంది. మహాఘట్బంధన్ నుంచి విడిపోయి బీజేపీతో జతకట్టిన జేడీయూ కేబినెట్లో చేరనుంది. జేడీయూ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. ఓ వైపు కేంద్ర సమచారా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడం, అనిల్‌దవే ఆకస్మిక మరణంతో కేబినెట్లో ఖాళీలు ఏర్పడ్డాయి.
దీంతో రక్షణ, పర్యావరణ వంటి కీలక శాఖలకు పూర్తి స్థాయి మంత్రులు లేరు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, శాస్త్ర, సాంకేతిక శాఖమంత్రి హర్షవర్ధన్ ఆ రెండు శాఖలను అదనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్లో పలు మార్పులు-చేర్పులు జరగవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం అదనపు శాఖలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రులకు ఆ భారం నుంచి సడలింపు ఇవ్వొవచ్చునని, కొత్తవాళ్లకు అవకాశం కల్పించవచ్చునని తెలుస్తోంది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







