ఆర్. నారాయణమూర్తి నటిస్తున్న 'అన్నదాత సుఖీభవ' ఈ నెల 4న ప్రారంభం
- August 01, 2017
ఆర్. నారాయణమూర్తి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో సామాజిక సమస్యలే ఇతివృత్తాలుగా చిత్రాలు తీస్తుంటారు. ఇప్పుడాయన మరో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. అదే... ‘అన్నదాత సుఖీభవ’. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ ‘‘ఈ నెల 4న పశ్చిమగోదావరి జిల్లాలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. అందరికీ అన్నం పెట్టే రైతు లేనిదే రాజ్యం లేదు. కానీ ఈనాడు ఆ రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. పంటకి గిట్టుబాబు ధర లభించకపోవడమే ఇందుకు ప్రధానకారణం. ఈ సమస్యే నా చిత్రానికి ఇతివృత్తం. రైతు ఆత్మహత్యలు ఆగాలంటే గిట్టుబాటు ధరల్ని అందించాల్సిందే. ఆ బాధ్యత మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ విషయాన్నే నా చిత్రం ద్వారా చెబుతున్నాను. దేశవ్యాప్తంగా పేరుకుపోయిన దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలిస్తేనే రైతులకి గిట్టుబాటు ధరలు లభిస్తాయి. 11 పాటలున్నాయి. రికార్డింగ్ కూడా పూర్తయింద’’న్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







