ఆన్లైన్ ద్వారా ఈ-వీసా విధానానికి రష్యా శ్రీకారం
- August 01, 2017
- వచ్చే ఏడాది జనవరి1 నుంచి అమల్లోకి
ఈ-వీసా విధానానికి రష్యా శ్రీకారం చుట్టింది. ఆన్లైన్ విధానం ద్వారా కేవలం మూడు రోజుల్లోనే వీసా సౌకర్యం కల్పించనున్నట్టు మినిస్ట్రీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఈస్టర్న్ రీజియన్స్ సంస్థ సోమవారం తెలిపింది. వచ్చే ఏడాది జనవరి1 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు తెలిపింది. తద్వారా, రష్యాలో వీసా కోసం దరఖాస్తు చేసుకోనున్న బ్రూనై, ఇండియా, చైనా, ఉత్తర కొరియా, మెక్సికో, సింగపూర్, జపాన్, అల్జీరియా, బహ్రెయిన్, ఇరాన్, ఖతార్, కువైట్, మొరాకో, యూఏఈ, ఒమాన్, సౌదీ అరేబియా, తునీషియా దేశాలకు చెందిన విద్యార్థుల వీసా ఇక్కట్లు తీరతాయని తెలిపింది. అయితే, ఈ-వీసాకు కేవలం 30 రోజులు మాత్రమే కాలపరిమితి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ-వీసా విధానం ద్వారా రష్యాకు పర్యాటకుల తాకిడి పెరిగి పర్యాటక రంగం అభివృద్ధి అయ్యే అవకాశముందని ఆ శాఖ డిప్యూటీ మంత్రి పావెల్ వోల్కోవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







