అరబ్‌ దేశాలపై డబ్ల్యుటిఓలో కతార్‌ ఫిర్యాదు

- August 01, 2017 , by Maagulf
అరబ్‌ దేశాలపై డబ్ల్యుటిఓలో కతార్‌ ఫిర్యాదు

అరబ్‌ దేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లు వాణిజ్యపరంగా తనను బహిష్కరించడంపై కతార్‌ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ)లో సోమవారం ఫిర్యాదు చేసిందని కతార్‌ డబ్ల్యుటిఓ కార్యాలయ డైరెక్టర్‌ అలీ అల్వలీద్‌ మీడియాకు తెలిపారు. ఆ మూడు దేశాలతో చర్చలు జరిపేందుకు కతార్‌ లాంఛనప్రాయంగా అభ్యర్థించింది. ఈ వాణిజ్య వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తీసుకున్న మొదటి చర్యలో భాగంగా ఆ మూడు దేశాలకు 60 రోజుల గడువును విధించింది. ఈలోగా తమ ఫిర్యాదును పరిష్కరించాలని, లేని పక్షంలో డబ్ల్యుటిఓలో వ్యాజ్యాన్ని, ప్రతీకార వాణిజ్య ఆంక్షలను ఎదుర్కొనాల్సి వుంటుందని హెచ్చరించింది. ఇచ్చిన హామీలకు అనుగుణంగా వారి చర్యలు వున్నాయా లేదా అనే విషయమై చట్టపరమైన వివరణలు ఇవ్వడానికి తాము తగినంత సమయం ఇచ్చామని అల్వలీద్‌ తెలిపారు. చర్చలు జరపడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని తాము నమ్ముతామని చెప్పారు. ఆ దేశాలు తీసుకున్న చర్యలపై మరింత సమాచారం తాము తెలుసుకోవాలనుకుంటున్నామని అన్నారు. తద్వారా ఈ వివాదానికి పరిష్కారాన్ని కనుగొనాలన్నారు.
కతార్‌ను బహిష్కరించడం వెనుక జాతీయ భద్రతే ప్రధాన కారణమని అరబ్‌దేశాలు డబ్ల్యుటిఓకు ఇంతకుముందే స్పష్టం చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com